పెద్దపల్లి, 15 అక్టోబర్ (హి.స.)
ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడీ
సెంటర్లకు ఒకే మోడల్ లో నూతన భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని 305 అంగన్వాడి సెంటర్లకు సంబంధించి టీచర్లకు, ఆయాలకు కొత్తగా డ్రెస్ కోడ్ రెండు జతల వస్త్రాలను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలా గ్రామాల్లో అంగన్వాడి భవనాల సమస్యలు ఉన్నాయని అన్నారు. సెంటర్లలో పిల్లలకు టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..