హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
మిస్టర్ టీ బ్రాండ్ యజమాని కే నవీన్
రెడ్డిని 6 నెలల పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నగర బహిష్కరణ విధించారు. వివరాల్లోకి వెళితే.. నవీన్ రెడ్డి తన కార్యకలాపాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. అతని పై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఐదు కేసులు ఉన్నాయి. ఈ కేసులలో ఉన్న సాక్ష్యులను సైతం బెదిరిస్తు కలవరం రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదిబట్ల ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీలు నవీన్ రెడ్డి బెదిరింపులు, వేధింపులు, అతని చట్ట వ్యతిరేక చర్యల పై నివేదికను రూపొందించి సీపీ ముందు పెట్టారు. వీటిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసు జారీ చేసి నగర బహిష్కరణ అమలు చేసినట్లు బుధవారం తెలిపారు. నవీన్ రెడ్డి పై గతంలో పీడీ యాక్ట్ కూడా పోలీసులు విధించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు