హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారo చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దారుణమైన ఘటన గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్నారా రైల్లో చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో రైల్లో గుర్తు తెలియని దుండగుడు మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పెద్దకూరపాడు ప్రాంతంలో రైలు ప్రయాణిస్తోంది. బాధితురాలి హ్యాండ్ బ్యాగు ను కూడా దోచుకున్న దుండగుడు, వెంటనే స్టేషన్ వద్ద దిగిపోయి పరారయ్యాడు.
షాక్కు గురైన మహిళ చర్లపల్లికి చేరుకున్న వెంటనే జీఆర్పీ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు