జానారెడ్డి జిల్లాలో.గ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన
జానారెడ్డి జిల్లాలో.గ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది


అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్‌ రూట్లో వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి, తాత వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఆరేళ్ల బాలుడు, తల్లి మృతిచెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు కూడా చనిపోయారు. మృతులు ఖమ్మంకు చెందిన వారిగా తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande