సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్, ఒక లక్ష మూడు వేలు..
గోదావరిఖని, 15 అక్టోబర్ (హి.స.) సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ మూడు రోజుల ముందే వస్తుంది. ఈనెల 17న సింగరేణి కార్మికులందరికీ దీపావళి బోనస్ ఇస్తున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒక్కొక్క కార్మికునికి పి ఎల్ ఆర్ బోనస్ ఒక్క లక్ష మూడు వేలు
సింగరేణి


గోదావరిఖని, 15 అక్టోబర్ (హి.స.)

సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ మూడు రోజుల ముందే వస్తుంది. ఈనెల 17న సింగరేణి కార్మికులందరికీ దీపావళి బోనస్ ఇస్తున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒక్కొక్క కార్మికునికి పి ఎల్ ఆర్ బోనస్ ఒక్క లక్ష మూడు వేలు (1,03,000)గా కంపెనీ ప్రకటించింది. కార్మికులకు సింగరేణి లాభాలతోపాటు, పి ఎల్ ఆర్ బోనస్, దసరా అడ్వాన్స్ అందించనుంది. ఒకే నెలలో పెద్ద మొత్తంలో సింగరేణి సంస్థ డబ్బులు ఇవ్వడం తో కార్మిక కుటుంబాల్లో ఆనందం కనబడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande