వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) వరుస నష్టాలకు బ్రేక్ పడి దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (FED) రేట్ కట్ అంచనాలు, ఆసియా మార్కెట్లలో సానుకూల సూచనలు కారణంగా బెంచ్మార్క్ ఇండెక్స్లు గణనీయంగా పైకి ఎగబాకాయి. సెన్సెక
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

వరుస నష్టాలకు బ్రేక్ పడి దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (FED) రేట్ కట్ అంచనాలు, ఆసియా మార్కెట్లలో సానుకూల సూచనలు కారణంగా బెంచ్మార్క్ ఇండెక్స్లు గణనీయంగా పైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 575 పాయింట్లు లాభపడి 82,605 పాయింట్ల, నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 25,300 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ 3 శాతం పెరిగిన నేపథ్యంలో పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, PSU బ్యాంకులు, మెటల్, టెలికాం సెక్టార్లు 1 నుంచి 2 శాతం లాభాలు సాధించాయి. బీఎస్ఈ BSE మిడ్క్యాప్ 1 శాతానికి, స్మాల్క్యాప్ 0.7 శాతానికి పెరిగాయి. ఇక నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, నెస్లే ఇండియా, ఆసియన్ పెయింట్స్ టాప్ గెయినర్గా నిలిచాయి. బజాజ్ ట్విన్స్ (ఫిన్సర్వ్ అండ్ ఫైనాన్స్) 4 శాతం వరకు చేరాయి. అదేవిధంగా మరోవైపు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఆక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా పడిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande