విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, 15 అక్టోబర్ (హి.స.) విద్యార్థులు అభ్యసించడంతోపాటు విద్యను క్రీడలలోను రాణించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహిస్తున్న అండర్ 14, అండ
వనపర్తి ఎమ్మెల్యే


వనపర్తి, 15 అక్టోబర్ (హి.స.)

విద్యార్థులు అభ్యసించడంతోపాటు విద్యను క్రీడలలోను రాణించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహిస్తున్న అండర్ 14, అండర్ 17 ఖోఖో, కబాడీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృడంగా ఉండాలని సూచించారు. క్రీడాపోటీలలో గెలుపు ఓటములు సహజమని ఓటమి చెందిన విద్యార్థులు మరోసారి ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడిన క్రీడా మైదానాన్ని అత్యాధునిక క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రూ.15 కోట్ల రూపాయలతో జిమ్, స్విమ్మింగ్ ఫుల్, నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande