ఎల్.ఈ.డి స్క్రీన్ లపై రాజన్న దర్శనం..
వేములవాడ, 15 అక్టోబర్ (హి.స.) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ,
వేములవాడ


వేములవాడ, 15 అక్టోబర్ (హి.స.)

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు ఈనెల 19, 20న శృంగేరి పీఠాధిపతి శ్రీ విధిశేఖర భారతీ తీర్థ స్వామి వేములవాడ పర్యటన నేపథ్యంలో బుధవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆలయ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులు,భక్తుల దర్శనాలు శృంగేరి పీఠాధిపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రూ.76 కోట్లతో మొదటి దశలో ఆలయ అభివృద్ధి పనులు, రూ.35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం భవనం నిర్మాణం, రూ.47 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో భక్తులకు ఆలయం ముందు భాగంలోని రావి చెట్టు కింద ఎస్ఈడీ తెర ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande