జూబ్లీహిల్స్లో నిర్మాణానికి - విధ్వంసానికి మధ్య ఎన్నిక.. గంగుల కమలాకర్
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. గతంలో హైదరాబాద్లో ఓ రోడ్డు నిర్మాణమో, రిపేరో జరుగుతుందంటే నగరవాసులకు, ప్రయాణికుల
గంగుల


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. గతంలో హైదరాబాద్లో ఓ రోడ్డు నిర్మాణమో, రిపేరో జరుగుతుందంటే నగరవాసులకు, ప్రయాణికులకు చుక్కలు కనిపించేవి. అలాంటిది బీఆర్ఎస్ హయాంలో రాత్రికిరాత్రే పనులు పూర్తి చేసి ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్నాం. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ జైత్రయాత్ర సాగించింది.

కానీ, ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి మాయమైంది. రేవంత్రెడ్డి పేద ప్రజల కోసం ఇండ్ల నిర్మాణాలకు బదులుగా కూల్చివేతలను ఎంచుకున్నారు. తాము జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా ఈ కాంగ్రెస్ పాలన పూర్తయ్యే సరికి ఉంటుందా.. ఉండదా..? అనే భయం హైదరాబాద్ ప్రజలను వెంటాడుతున్నది. చెరువులు, నాలాలకు సమీపంలో ఇండ్లు ఉన్న ప్రజలు రోజూ హైడ్రా భయంతోనే బతకాల్సి వస్తున్నది. దీన్ని దూరం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాల్సిందే. అందుకే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి.. అది జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలి అని గంగుల కమలాకర్ ట్వీట్లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande