పాఠశాల విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం..
యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.) సైబర్ బెదిరింపులు సైబర్ మోసాలకు గురైతే డయల్ 1930, ఉమెన్ హెల్ప్ లైన్ 1091,181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098/112, డయల్ 100 వంటి విభిన్న సేవలు కోసం వేర్వేరు నెంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంల
ఆలేరు పోలీసులు


యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.)

సైబర్ బెదిరింపులు సైబర్ మోసాలకు గురైతే డయల్ 1930, ఉమెన్ హెల్ప్ లైన్ 1091,181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098/112, డయల్ 100 వంటి విభిన్న సేవలు కోసం వేర్వేరు నెంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒకటే నెంబర్ 112 కొనసాగుతుందని ఆలేరు పోలీసులు తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బాల కార్మికులు నిర్బంధ కార్మికుల గురించి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలికలను మహిళలను మోసపూరితంగా లేదా బలవంతంగా అపహరించి బలవంతపు వ్యభిచారం చేయించడం సరికాదన్నారు. బాలలను అమ్మడం అమ్మి వారితో బిక్షాటన చేయించడం, బాలికలను వేధించడం, సైబర్ క్రైమ్ చేయించడం, అవయవాల మార్పిడికి వీళ్లను ఉపయోగించడం, మహిళలకు ప్రయాణంలో టీ షఫ్ అప్లికేషన్ ఉపయోగించడం, రోడ్డు భద్రత మత్తు పదార్థాల వాడకం, కొత్త చట్టాలు అయిన భారతీయ న్యాయ సంయక్త, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్షి అది నీయంలపై అవగాహన కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande