బీహార్, 16 అక్టోబర్ (హి.స.)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. బీహార్లో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఇప్పటికీ సీట్ల పంపకాల ప్రతిష్టంభనతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ జేడీయూ (JDU) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను (57 మంది అభ్యర్థులతో) విడుదల చేసిన జేడీయూ.. ఇప్పుడు రెండో జాబితా (ఫైనల్ లిస్ట్)ను కూడా రిలీజ్ చేసింది. 44 మంది అభ్యర్థులను ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు