వరంగల్, 16 అక్టోబర్ (హి.స.) వరంగల్ ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నేటికీ పత్తి కొనుగోళ్లపై స్పష్టత లేదు. మార్కెట్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు లేవు. వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోళ్లు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర కోసం సీసీఐ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు కేంద్రాల ఏర్పాటు లేదు. దీపావళి తర్వాతనే కొనుగోలు కేంద్రాలు తెరుస్తారని అధికారులు సీసీఐ ప్రకటిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అకాల రైతులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు వచ్చిన ధరకే అమ్మకాలు చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉందని, దూది కంటే గింజలు బాగా ఉన్నాయని ధర తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..