హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
అనుమతి లేని కన్వెన్షన్కు నార్సింగి
మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ సమీపంలో మేకన్ గడ్డ ప్రాంతంలో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 5 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో కన్వెన్షన్ నిర్మిస్తున్నారనే అంశంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ తన సిబ్బందితో బుధవారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకొని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కన్వెన్షన్ పనులను నిలిపివేశారు.
కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అక్కడ ఉన్న పనిముట్లను సీజ్ చేసి నార్సింగి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. బుధవారం సంబంధిత కన్వెన్షన్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపాలిటీ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..