హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee
Hills by-election)పై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్నదనే చెప్పాలి. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం సైతం ఫోకస్ పెట్టింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. నాలుగేండ్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలించడంతో ఎక్కడెక్కడ తక్కువగా నమోదైందనే అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రముఖుల తో ప్రచారం చేయించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..