నల్గొండ, 16 అక్టోబర్ (హి.స.)
వైద్య సిబ్బంది సమయపాలన
పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు,సిబ్బంది అందుబాటు ఉండి మెరుగైన వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ సమయ పాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. సమయ పాలన పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని, శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలని, ఓపిని తనిఖీ చేశారు.రికార్డులను, ఫార్మసీ, లేబర్ రూములు పరిశీలించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు శోకకుండా అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు