హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
మంత్రి కొండ సురేఖ ఓఎస్డ్ సుమంత్ ఎపిసోడ్ పై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ ఓఎన్డీగా పనిచేస్తున్న సుమంత్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో మూడు రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించామని తెలిపారు. తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికి మంత్రి OSD కావడంతో పర్సనల్ గా మాట్లాడేందుకే మంత్రి నివాసానికి వెళ్లామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అలాగే సుమంత్ పై ఆరోపణలు వచ్చినప్పటికి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, అతను అందుబాటులోకి వస్తే.. అతనిపై వచ్చిన ఆరోపణలపై మాత్రమే విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు