అమరావతి, 16 అక్టోబర్ (హి.స.)
: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నన్నూరు సమీపంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో ప్రధాని మోడీ భారీ బహిరంగసభ కొనసాగనుంది. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేయనున్నారు. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, వేదిక ఉండనుంది. జన సమీకరణకు దాదాపుగా 7వేల బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,280 కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ, రూ.4920 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి, రూ. 1200 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, గెయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రూ. 1730 కోట్లతో శ్రీకాకుళం – అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్, కర్నూలు పిఎస్ – 3 వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.2,886 కోట్లతో అదనపు పవర్ గ్రేడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ