పశుసంవర్ధక శాఖ పనితీరును బలోపేతం చేయండి : ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, 16 అక్టోబర్ (హి.స.) పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో గురువారం జాతీయ
పెద్దపల్లి ఎమ్మెల్యే


పెద్దపల్లి, 16 అక్టోబర్ (హి.స.)

పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో గురువారం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రచార పోస్టర్ లను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు.

పెద్దపల్లి నియోజకవర్గం అంతా వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నందున ఇక్కడ పశుసంపద కూడా అధికంగానే ఉందని, ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ పనితీరును మెరుగు పరుస్తూ పశుసంపదను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని, మూగ జీవాల ఆరోగ్యంపై పశుసంవర్థక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను చేసి పెడుతానని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande