నిర్మల్, 16 అక్టోబర్ (హి.స.)
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కచ్చితంగా మార్చి తీరుతామని ప్రకటించారు. దీంతోపాటు పార్టీ కోసం కనీసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పెద్దస్థాయిలో ఏమైనా జరిగితే మినహా.. డీసీసీల మార్పు తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో పార్టీని సమర్థంగా నడిపించేవారు దొరకని పక్షంలో మాత్రమే పాతవారిని కొనసాగిస్తారని, లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏ మేరకు పనిచేస్తుందన్న ప్రశ్న పార్టీలో మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..