హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
నగర శివార్లలోని సప్తగిరి ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా ముజ్రా పార్టీని నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించిన ఘటనలో 25 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి రూ.2 లక్షల 45 వేల ముప్పై రూపాయలు, 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కిట్టి పార్టీ పేరుతో సప్తగిరి అనే ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా ముజ్రా పార్టీ (యువతలతో అశ్లీల నృత్యాలు) ని నిర్వహిస్తున్నారు.
ఈ పార్టీకి నగరం నుంచి 25 మంది 8 మంది యువతులు, 17 మంది యువకులు పాల్గొన్నారు. పోలీస్ బృందం ముజ్రాపార్టీ పై దాడి చేయగా, 8 మంది యువతులను, 17 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2 లక్షల 45 వేల ముప్పై రూపాయలను, 11 కార్లు, 25 మొబైల్స్, మూడు ఫుల్ బాటిల్స్, 18 బీర్ బాటిల్స్, మూడు బ్రీజర్స్ ను స్వాధీనం చేసుకుని పట్టుబడిన వారిని మంచాల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ప్రాథమిక సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు