జేఏసీ ఆధ్వర్యంలో కొడంగల్ లో భారీ ర్యాలీ, ధర్నా
వికారాబాద్, 16 అక్టోబర్ (హి.స.) కొడంగల్ కు మంజూరైన మెడికల్, వెటర్నరీతో పాటు పాత కొడంగల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను లగచర్ల గ్రామనికి తరలించవద్దని కొడంగల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు కొడంగల్ పట్టణ ప్రజలు. కొడం
కొడంగల్


వికారాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

కొడంగల్ కు మంజూరైన మెడికల్,

వెటర్నరీతో పాటు పాత కొడంగల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను లగచర్ల గ్రామనికి తరలించవద్దని కొడంగల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు కొడంగల్ పట్టణ ప్రజలు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గ్రామస్తులు, రాస్తా రోకో కార్యక్రమన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైన కొడంగల్ మండలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనుకుంటే కొడంగల్ కు మంజూరైన మెడికల్ వెటర్నరీ, కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇక్కడి నుంచి మారుమూల గ్రామమైన లగచర్ల గ్రామనికి తరలించడం సమంజసం కాదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande