భద్రాద్రి కొత్తగూడెం, 16 అక్టోబర్ (హి.స.)
భవిష్యత్తు తరానికి డ్రగ్స్ రహిత
సమాజాన్ని అందించేందుకు కృషి చేయాలని ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రబాను పిలుపునిచ్చారు. గురువారం ఇల్లెందు పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ తో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్ కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను అంధకారంగా మార్చుకున్నారని గుర్తు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని డ్రగ్స్ రవాణా, వాడకం నేరమని తెలిపారు. పాఠశాలలు కళాశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థుల నడవడికను ఎప్పటికప్పుడు గమనించి డ్రగ్స్ మహమ్మారికి బానిసలు కాకుండా అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు సైతం విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు