డబుల్ బెడ్రూం ఇళ్లలో అక్రమ ప్రవేశం.. నాన్బేలబుల్ కేసు నమోదు..
మహబూబాబాద్, 16 అక్టోబర్ (హి.స.) మహబూబా జిల్లా తొర్రూరు పట్టణంలోని చీకటాయపాలెం రోడ్డులో నిర్మితమైన 280 డబుల్ బెడ్రూం ఇళ్లలోకి కొంతమంది వ్యక్తులు అక్రమంగా చొరబడిన ఘటనపై తొర్రూరు పోలీసులు నాన్బోలబుల్ కేసు నమోదు చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్య
నాన్ బెయిలబుల్ కేసు


మహబూబాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

మహబూబా జిల్లా తొర్రూరు పట్టణంలోని చీకటాయపాలెం

రోడ్డులో నిర్మితమైన 280 డబుల్ బెడ్రూం ఇళ్లలోకి కొంతమంది వ్యక్తులు అక్రమంగా చొరబడిన ఘటనపై తొర్రూరు పోలీసులు నాన్బోలబుల్ కేసు నమోదు చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అధికార అనుమతులు లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, అధికారులు డబల్ బెడ్ రూమ్ కి వేసిన తాళాలను పగులగొట్టి ఇండ్లలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోగా, అక్కడ ఉన్న కొంతమంది అధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande