సంగారెడ్డి, 16 అక్టోబర్ (హి.స.)
వడ్ల కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. రైతులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 195 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏ గ్రేడ్ సన్నకరానికి రూ.2389 మద్దతు ధర ఇస్తుండగా ప్రభుత్వం రూ.500బోసన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కామన్ రకానికి రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నది. వడ్ల కొనుగోలు పై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ మాధురి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు.
ఖరీఫ్ లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,51,222 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్నరకం 38,235 ఎకరాల్లో, దొడ్డు రకం 1,12,987 ఎకరాల్లో సాగైంది. సాగైన పంట నుంచి మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులు తమ అవసరాలకు వాడుకునే ధాన్యం పోగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు 195 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఏ గ్రేడ్ సన్నకరానికి రూ.2389 మద్దతు ధర ఇస్తుండగా ప్రభుత్వం రూ.500 బోసన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కామన్ రకానికి రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..