హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
తమ సమస్యలు పరిష్కరించాలని సెర్ఫ్ (SERP)ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీవోఏలకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయం ఎందుట ఆందోళనకు దిగారు. వీవోఏలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఎర్ పాలసీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీవోఏ ఉద్యోగ భద్రత, రూ.20 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారన్న ఆ హామిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ సౌకర్యంతో పాటు సీసీ పోస్టులకు వీవోఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 58 ని వెంటనే రద్దు చేయాలన్నారు. డిజిటలైజేషన్ దృష్ట్యా ల్యాప్టాప్ /కంప్యూటర్ / ఇంటర్నెట్ బిల్లు సదుపాయం కల్పించాలనన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు