సిద్దిపేట, 16 అక్టోబర్ (హి.స.)
గజ్వేల్ డివిజన్ పరిధిలోని పలు
పోలీస్ స్టేషన్లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.యం. విజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కార్యాలయం, గజ్వేల్ ట్రాఫిక్, గజ్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్, గౌరారం, ములుగు, మర్కుక్, జగదేవపూర్, పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు