MRO ఆఫీసులో సగం మంది అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్
సూర్యాపేట, 16 అక్టోబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా అధికారులకు కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కానీ ఉదయం 11 గంటలు
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 16 అక్టోబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లా అధికారులకు కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కానీ ఉదయం 11 గంటలు దాటినా సగానికి పైగా రెవెన్యూ అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆఫీసులో సిబ్బంది సమయపాలన పాటించరా అని తహసీల్దార్ను ప్రశ్నించారు. వెంటనే విధులకు గైర్హాజరు అయిన డిప్యూటీ తహసీల్దార్, ఎంపీఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లతో సహా మరికొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కార్యాలయ సిబ్బంది గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సిబ్బంది హాజరు రిజిస్టర్ను స్వాధీనం చేసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande