అమరావతి, 16 అక్టోబర్ (హి.స.)
ఏపీలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుంది.ఈ రోజు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంతో పాటు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.అలాలే ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ప్రవేశించనున్నాయి.
దీని ప్రభావంతో ఈ రోజు ఏపీ పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనుండగా అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV