మంత్రుల పేషిపై నిఘా పెంచిన సర్కారు.. ఇంటెలిజెన్స్కు బాధ్యతలు
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలోని మంత్రుల పేషీల్లో పనిచేస్తోన్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పీఎస్, ఓఎన్డీ, పీఏలు చేస్తున్న దందాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రచారం
సెక్రటేరియట్


హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలోని మంత్రుల పేషీల్లో

పనిచేస్తోన్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పీఎస్, ఓఎన్డీ, పీఏలు చేస్తున్న దందాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఎందుకంటే కొన్ని మంత్రుల పేషిల పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో సీఎంఓ అలర్ట్ అయినట్లు తెలిసింది. ఈ మధ్య ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ సుమంత్పై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆతన్ని ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో మిగతా మంత్రుల పేషిలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకునే పనిలో సీఎంఓ ఉంది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు అప్పగించడంతో మంత్రుల కార్యాలయ సిబ్బందిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande