హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
తెలంగాణలో నేడు నైరుతి రుతుపవనాలు తిరోగమనం పట్టనుండగా ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో పొడితావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు గ్యాప్ లేకుండా వర్షాలు దంచికొట్టాయి. పలు జిల్లాల్లో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్ష ప్రభావం తగ్గుముకం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..