ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
హుజురాబాద్, 16 అక్టోబర్ (హి.స.) హుజురాబాద్ మండలంలోని రాంపూర్ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వి
యాక్సిడెంట్


హుజురాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

హుజురాబాద్ మండలంలోని రాంపూర్ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు ఇసుక ట్రాక్టర్ను నడుపుతున్నాడు. అతను విలాసాగర్ నుంచి పెద్దపాపయ్య పల్లెకు ఇసుకను తరలించి అన్లోడ్ చేసిన అనంతరం తిరిగి తన స్వగ్రామం రంగాపూర్కు బయలుదేరాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోకి రాగానే నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ట్రాక్టర్ను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే అదుపు తప్పిందని తెలుస్తోంది. వేగాన్ని నియంత్రించలేకపోయిన ట్రాక్టర్ ఒక్కసారిగా రహదారి మీది నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడిన డ్రైవర్ చింటూ తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande