హనుమకొండ, 16 అక్టోబర్ (హి.స.)
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (National Athletics) పోటీలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభను చాటారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య పోటీలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అథ్లెట్లు ఒలంపిక్స్లోలో పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
ఖేలో ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఒలంపిక్స్ పోటీలుజరిగే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు, ఇటీవల ఎంపీలందరం పీటీ ఉషను కలిసినట్లు ఆమె గుర్తుచేశారు. మన క్రీడాకారులు ఒలంపిక్స్లోలో పాల్గొని పతకాలు సాధించేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చాలా ఇంట్రెస్తోట్తో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ స్పిరిట్తో క్రీడాకారులు ప్రతిభను చూపాలని, వరంగల్లో నేషనల్స్ జరగడం క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు