కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రా వంటకాలకు ఘాటు ఎక్కువ అని మన పొరుగు రాష్ట్రాల వారు అంటుంటారని, చూస్తుంటే మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు కూడా ఘాటు ఎక్కువే ఉన్నట్లుందని మంత్రి నారా లోకేశ్ చమత్కరించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పెట్టుబడుల సెగ పొరుగువారికి ఇప్పటికే తగులుతున్నట్లు ఉందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని మంత్రి నారా లోకేశ్ తన ట్వీట్ లో వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV