మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు..
పెద్దపల్లి, 2 అక్టోబర్ (హి.స.) మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకుని నిండు ప్రాణాన్ని కాపాడారు. బుధవ
మంత్రి శ్రీధర్ బాబు


పెద్దపల్లి, 2 అక్టోబర్ (హి.స.)

మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకుని నిండు ప్రాణాన్ని కాపాడారు. బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు పాల్గొన్నారు. కార్యక్రమాలను ముగించుకుని కరీంనగర్కు తిరుగు పయనమయ్యారు. కాగా మార్గమధ్యలో పెద్దపల్లి శివారులో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అటువైపుగా వెళ్లుతున్న మంత్రి గాయాలతో పడి ఉండడాన్ని గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రునికి వాహనాన్ని సమకూర్చి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫోన్ లో వైద్యులతో మాట్లాడి.... ప్రత్యేక చొరవ తీసుకుని క్షతగాత్రుడికి సకాలంలో అత్యవసర వైద్యం అందేలా చూడాలని డాక్టర్ లకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande