పద్మ విభూషణ్ గ్రహీత చన్నులాల్ మిశ్రా కన్నుమూత
లక్నో, 2 అక్టోబర్ (హి.స.) శాస్త్రీయ గాయకుడు,పద్మ విభూషణ్ గ్రహీత చన్నులాల్ మిశ్రా(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చన్నులాల్ తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. చన్నులాల్ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశ
చెన్నులాల్


లక్నో, 2 అక్టోబర్ (హి.స.)

శాస్త్రీయ గాయకుడు,పద్మ విభూషణ్ గ్రహీత చన్నులాల్ మిశ్రా(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చన్నులాల్ తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. చన్నులాల్ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గురువారం తెల్లవారుజామున చన్నులాల్ మిశ్రా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల 18 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమార్తె నమ్రత మిశ్రా పేర్కొన్నారు. మిశ్రా అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5 గంటలకు వారణాసిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మిశ్రాకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రామ్కుమార్ మిశ్రా తబలా ప్లేయర్గా ప్రసిద్ధుడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande