కామారెడ్డి, 2 అక్టోబర్ (హి.స.)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జోరుగా కొనసాగుతున్న మాంసం విక్రయాలు, నేడు గాంధీ జయంతి సందర్భంగా మాంసం,మద్యం సేవించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కామారెడ్డి పట్టణంలో దానికి విరుద్ధంగా మాంసం అమ్మకాలు స్వేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ రెండు రోజుల క్రితమే గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా మాంసం విక్రయాలు జరగకూడదని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన పట్టించుకోని విక్రయదారులు. మాంసం అమ్మకాలపై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా కామారెడ్డి పట్టణంలో ఎక్కడ కూడా సమ్మకాలు జరగడం లేదని రెండు రోజుల క్రితమే మాంసం విక్రయదారులకు నోటీసులు అందజేశామని తెలియజేశారు. అదేవిధంగా మాంసం అమ్మకుండా స్పెషల్ టీములు ఏర్పాటు చేశామని తెలిపారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు