బంగారం కొనలనుకుంటున్నారా..? దీపావళి రోజున హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)కొద్దిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిగ్రాముల బంగారం లక్షా 30 వేల మార్క్ దాటింది.. వెండి కూడా భారీగా పెరిగింది.. కిలో వెండి ధర దాదాపు 2 లక్షల వరకు చేరింది.. ఈ క్రమంలోనే..
gold


అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)కొద్దిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిగ్రాముల బంగారం లక్షా 30 వేల మార్క్ దాటింది.. వెండి కూడా భారీగా పెరిగింది.. కిలో వెండి ధర దాదాపు 2 లక్షల వరకు చేరింది.. ఈ క్రమంలోనే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు దీపావళి పండుగకు ముందు దంతేరస్ రోజున భారీగా తగ్గాయి.. అయితే.. పండుగ నాడు ధరలు స్వల్పంగా తగ్గాయి.. బంగారం 10 గ్రాములపై రూ.10 మేర ధర తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.200 మేర ధర తగ్గింది.. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. సోమవారం (అక్టోబర్ 20 2025) దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,30,850 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములు రూ.1,19,940 గా ఉంది.

వెండి కిలో రూ.1,71,900 లుగా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande