పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.
ముంబై, 17 అక్టోబర్ (హి.స.)దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో సమాన్యుడికి బంగారం అందనంత దూరంగా వెళ్తొంది. ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతోంది. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరువలో ఉంది
gold


gold


ముంబై, 17 అక్టోబర్ (హి.స.)దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో సమాన్యుడికి బంగారం అందనంత దూరంగా వెళ్తొంది. ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతోంది. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అయితే గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం పసిడి ప్రియులకు కాస్తా ఊరట కలిగిందనే చెప్పవచ్చు.

తాజాగా అక్టోబర్‌ 17న దేశీయంగా బంగారం ధరలు రూ.20 తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.1,18,640కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.1,88,900గా ఉంది. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో వెండి ధర రూ.2,05,900గా కొనసాగుతుంది. అంటే వెండి కూడా తగ్గేదేలే అనట్టు దూసుకుపోతుంది. తాగా ధరలతో రూ.2లక్షల మార్క్‌ను దాటి రికార్డ్ క్రియేట్‌ చేసింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశాల ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,790 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande