బంగారం ధర తెలిస్తే దడే..! ఒక్కరోజులో ఎంత పెరిగిందో చూస్తే గుండెలు గుభేల్..! రూ. 2 లక్షలు దాటిన వెండి
ముంబై, 18 అక్టోబర్ (హి.స.)ఈ 2025 సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.. అవును.. ఎందుకు ఎప్పుడూ లేనంతగా ఈ యేడు బంగారం ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు ఏదో వందల్లో తగ్గితే.. ఆ మార్నాటికే వేలల్లో పైకి లేస్తుంది బంగారం ధర. సామాన్య మధ్యతరగతి ప్రజల
gold


ముంబై, 18 అక్టోబర్ (హి.స.)ఈ 2025 సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.. అవును.. ఎందుకు ఎప్పుడూ లేనంతగా ఈ యేడు బంగారం ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు ఏదో వందల్లో తగ్గితే.. ఆ మార్నాటికే వేలల్లో పైకి లేస్తుంది బంగారం ధర. సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం గోల్డ్‌ వైపు కన్నెత్తి చూడాలన్న కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అంతర్జాతీయ మార్కె ట్లో ధరలు భారీగా పెరగడంతోపాటు దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ కూడా దీనికి కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే సరిగ్గా ప్రజలందరీ పండగ సెంటిమెంట్‌ ధంతేరాస్ వేడుకకు ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

– ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,930 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,860 ఉంది. ఇక, 18 క్యారెట్ల ధర రూ.97,210

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590

– పూణేలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590

– కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18క్యారెట్ల ధర రూ.99,590

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande