ముంబై, 21 అక్టోబర్ (హి.స.)
. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ధరలు తగ్గినప్పటికీ, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1 లక్ష పైన ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 21వ తేదీ) మంగళవారం దేశీయంగా బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం..
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
హైదరాబాద్‌లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.10లు తగ్గి రూ. 1,30,680లుగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 1,19,790లు గా కొనసాగుతోంది. దాదాపు ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, వరంగల్, రాజమండ్రి, పొద్దుటూరు, నిజామాబాద్ లలో ఉన్నాయి.
డిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.1, 19, 940లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర రూ. 1, 30, 830లకు చేరుకుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 19, 790లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర రూ. 1, 30, 680లు గా కొనసాగుతోంది. ఇవే ధరలు చెన్నై , కోల్‌కతా, బెంగళూరు , కేరళ, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వెండి ధర వెండి ధరలు కూడా గత కొంతకాలంగా పరుగులు పెడుతోంది. వెండి వినియోగం ఎక్కువ కావడంతో పాటు వెండి ని కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి. అయితే బంగారంలో బాటలోనే పయనిస్తూ వెండి కూడా స్వల్పంగా తగ్గింది. ఈ రోజు దేశ రాజధాని ధిల్లీ సహా ప్రధాన నగరాల్లో వెండి ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం..
ఈ రోజు వెండి ధర కిలోకు రూ. 100 లు తగ్గి దేశ రాజధాని డిల్లీతో పాటు కోల్‌కతా,ముంబై, బెంగళూరు నేడు కిలో 1,71,900లుగా కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళ సహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి కి 100 లు తగ్గి.. నేడు 1, 89, 900లుగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV