
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) టీమిండియా మాజీ కెప్టెన్ రోహితశర్మ
(Rohit Sharma) మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఈ మేరకు తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ (One Day Rankings)లో ముంబైకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 781 పాయింట్స్తో అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, 38 ఏళ్ల 182 రోజుల వయసులో ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో నంబర్వన్గా నిలిచి రోహితశర్మ కొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంతకు ముందు అగ్ర స్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubhman Gill)ను వెనక్కి నెట్టి రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరిస్లో అద్భుత ప్రదర్శనతో రోహితశర్మ తన కెరీర్లో మొదటిసారి నంబర్వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. అడిలైడ్ (Adelaide) వేదికగా జరిగిన రెండో వన్డేలో 97 బంతుల్లో 73 పరుగులు చేసిన రోహిత్ సిడ్నీ (Sydney) వేదికగా జరిగిన మూడో వన్డేలో 125 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంకు సాధించిన భారత క్రికెటర్లలో రోహితశర్మ ఐదో ఆటగాడిగా నిలిచారు. ఈ ఎలైట్ జాబితాలో ఆయన క్రింది దిగ్గజాల సరసన చేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు