
పితంపూర్, 30 అక్టోబర్ (హి.స.)మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని పితంపూర్‌లో రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భారీ క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌పై క్రేన్ పడటంతో ఇద్దరు మరణించారు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ట్రక్కులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
ధార్ ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ మాట్లాడుతూ.. కుటి రోడ్‌లో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. పికప్ ట్రక్కును క్రేన్ ఢీకొట్టి బోల్తా పడిందని చెప్పారు. దీంతో ట్రక్కు లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు. మృతులను గుర్తించామని.. అభయ్ కుమార్, పర్మార్ అని తెలిపారు. పోస్టుమార్టం కోసం పంపించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు