ఈ ఏడాది 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం
న్యూఢిల్లీ, 31 అక్టోబర్ (హి.స.) వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన
వలసల న్యూస్


న్యూఢిల్లీ, 31 అక్టోబర్ (హి.స.) వలసదారులపై అగ్రరాజ్యం

అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వారిని సొంత దేశాలకు పంపుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని వారి స్వదేశాలకు పంపించిన ట్రంప్ సర్కార్.. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 2,790 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. వారందరినీ స్వదేశానికి పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకూ అమెరికాలో ఉండటానికి కావలసిన అర్హత ప్రమాణాలను పాటించని, అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికిపైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు అక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. వారి జాతీయతను, గుర్తింపును మేమే ధ్రువీకరించాం. ఆ తర్వాత వారిని అమెరికా నుంచి వెనక్కి పంపించారు' అని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande