
న్యూఢిల్లీ, 31 అక్టోబర్ (హి.స.)
దేశంలో జరుగుతున్న అల్లర్లకు, హింసకు ఆర్ఎస్ఎస్సే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అంతేకాదు Rssపై తక్షణమే నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు మోదీ తూట్లు పొడుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ వర్ధంతి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మహాత్మాగాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని సర్దార్ పటేల్ 1948లో రాసిన లేఖను గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని కొనియాడారు. దేశ, ఐక్యత, సమగ్రత కోసం పటేల్, ఇందిరాగాంధీ కృషి చేశారని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు