నేడు ఆసీస్ తో సెమీ ఫైనల్స్..వర్షం పడితే టీమిండియా ఇంటికేనా ?
ముంబై, 30 అక్టోబర్ (హి.స.) వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మహిళల ఆస్ట్రేలియా, టీమిండియా మహిళల జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఎప్పటిలాగే ఇవాళ మధ్యాహ్నం 3:00 సమయ
క్రికెట్


ముంబై, 30 అక్టోబర్ (హి.స.)

వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో

భాగంగా ఇవాళ మహిళల ఆస్ట్రేలియా, టీమిండియా మహిళల జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఎప్పటిలాగే ఇవాళ మధ్యాహ్నం 3:00 సమయంలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉంది. వర్షం పడితే, DLS రూల్స్ ప్రకారం ఓవర్లను కుదింపు చేస్తారన్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది.

ఉదాహరణకు పురుషుల టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్న జరిగిన మొదటి వన్డేను చూసుకోవచ్చు. అందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండో సెమీ ఫైనల్ లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. అయితే మ్యాచ్ జరగకుండా వర్షం భారీగా పడితే... రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. అలా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, రిజర్వ్ డే ఉంటుంది. ఇక రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరుగకపోతే, ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు టీమిండియా ఇంటికి వెళ్లాల్సిన ప్రమాదం పొంచి ఉంటుంది. గ్రూప్ స్టేజ్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రభాగంలో నిలిచింది. మ్యాచ్ రద్దు అయితే ఆ పాయింట్ల ప్రకారం ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఇప్పుడు ఇదే అంశం టీమిండియా అభిమానులకు టెన్షన్ గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande