బెంగళూరులో డ్రైవర్‌ రహిత కారు
బెంగళూరు, 30 అక్టోబర్ (హి.స.) నగర ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు డ్రైవర్‌ అవసరం లేని కారు తయారీ చేపట్టారు. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మతీర్థ స్వామి ఇటీవల కళాశాలకు వచ్చినప్పుడు ఆ కారులో కాసేపు విహరించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప
బెంగళూరులో డ్రైవర్‌ రహిత కారు


బెంగళూరు, 30 అక్టోబర్ (హి.స.) నగర ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు డ్రైవర్‌ అవసరం లేని కారు తయారీ చేపట్టారు. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మతీర్థ స్వామి ఇటీవల కళాశాలకు వచ్చినప్పుడు ఆ కారులో కాసేపు విహరించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కారు ప్రాజెక్టు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు కళాశాల యాజమాన్య ప్రతినిధులు వివరించారు. కొద్ది నెలల్లోనే దీన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. విప్రో, భారతీయ విజ్ఞాన సంస్థ, ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల సంయుక్త భాగస్వామ్యంలో అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande