
న్యూ డిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)ఇరాన్‌లోని చాబహార్ పోర్టు (Irans Chabahar Port) విషయంలో భారత్‌కు ఊరట లభించింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా ఆంక్షల నుంచి దీనికి మినహాయింపు దొరికింది. అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపునకు నేటితో గడువు ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఈ గడువు పొడిగింపు వచ్చింది. దీంతో చాబహార్ పోర్ట్‌లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణకు భారత్‌కు వీలు కలిగింది (US sanctions waiver).
మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నెరపడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్‌దే కీలక పాత్ర. ఇప్పటికే న్యూదిల్లీ ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది. కజఖిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు భారత్ ఇక్కడినుంచి సరకు రవాణా చేయవచ్చు. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు