దేశ ప్రజలకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి
ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఆధార్ నమోదు విషయంలో కొత్త రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా గతం ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి
big-alert-for-the-people-of-the-country-new-rules-will-come-into-effect-from-november-1-488910


ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఆధార్ నమోదు విషయంలో కొత్త రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా గతం ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులుకాయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అప్‌డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రూ.75 రుసుము చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అందుబాటులోకి రాబోతోంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ కోసం గతంలో ఒక్క నామినీని పెట్టుకునేందుకు మాత్రమే అనుమతించే వారు. అయితే, ఆర్‌బీఐ తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి ఖాతాదారులు నలుగురు నామినీలను నామినేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లు రూ.వేయికి పైన వ్యాలెట్ రీచార్జ్‌కు నవంబర్ 1 నుంచి 1 శాతం ఫీజును ఎస్‌బీఐ వసూలు చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande