ఐరాస వేదికపై భారత ప్రతినిధిగా ప్రసంగించిన దగ్గుబాటి పురందేశ్వరి
ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeswari) భారతదేశానికి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన చర
దగ్గుబాటి పురందేశ్వరి


ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeswari) భారతదేశానికి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన చర్చల్లో ఆమె భారతదేశం తరఫున జాతీయ ప్రకటనను వినిపించారు. పురందేశ్వరి భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం తరఫున 80వ ఐక్యరాజ్యసమితి సమావేశానికి (80th United Nations General Assembly) న్యూయార్క్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికపై మాట్లాడుతూ.. పురందేశ్వరి “భారతదేశం ఎప్పటికీ శాంతియుత అణుశక్తి వినియోగానికి కట్టుబడి ఉందని” స్పష్టం చేశారు.

అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనాలకే వినియోగించాలనే దృక్పథాన్ని భారత్ కొనసాగిస్తోందని, ప్రపంచ శాంతి, స్థిరాభివృద్ధి దిశగా భారతదేశం నిరంతరం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ పురందేశ్వరి తన ప్రసంగంలో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం (Indian Parliamentary Delegation) తరపున మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగం భారత ప్రతినిధి వర్గం నుంచి ప్రశంసలు అందుకుంది. ఐరాసలో భారత స్థానం బలపడేలా ఆమె స్పష్టమైన వ్యాఖ్యలు చేసినట్లు విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande