ప్రెసిడెంట్ ట్రంప్‌ పేరిట ఫేక్‌ ఆధార్‌ కార్డు.. ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై, 30 అక్టోబర్ (హి.స.)మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరిట నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినందుకు గాను ఎన్సీపీ (NCP) శరద్‌ పవార్‌ వర్గ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌ (Roh
ప్రెసిడెంట్ ట్రంప్‌ పేరిట ఫేక్‌ ఆధార్‌ కార్డు.. ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు


ముంబై, 30 అక్టోబర్ (హి.స.)మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరిట నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినందుకు గాను ఎన్సీపీ (NCP) శరద్‌ పవార్‌ వర్గ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌ (Rohit Pawar)పై ముంబయి సౌత్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బీజేపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ధనంజయ్ వాఘస్కర్ (Dhananjay Waghaskar) దాఖల చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 16న జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ పవార్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరిట ఫేక్ నకిలీ ఆధార్ కార్డును ప్రదర్శించారని ధనంజయ్ వాఘస్కర్ ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు రోహిత్ పవార్‌పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద BNS 336 (ఫోర్జరీ), 338 (ఫేక్ డాక్యుమెంట్ల ఉపయోగం), 353 (ఫేక్ ఇన్ఫర్మేషన్) కింద నమోదైంది.

అయితే, ఆధార్ కార్డు వ్యవస్థలోని లోపాలను బయటపెట్టడానికే తాను డోనాల్డ్ ట్రంప్ పేరిట ఫేక్ ఆధార్ కార్డును ప్రదర్శించానని ఎమ్మెల్యే రోహిత్ పవార్ వివరణ ఇచ్చారు. నకిలీ ఆధార్ కార్డులతో ఓటరు జాబితాల్లో కూడా అక్రమాలు జరగవచ్చని, మహారాష్ట్ర ఎన్నికల్లో గుర్తింపు దుర్వినియోగం జరగవచ్చని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదాన్ని రేకెత్తించింది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థాగత మోసాలకు పాల్పడుతోందని ఆరోపిస్తుండగా.. మరోవైపు అధికార బీజేపీ (BJP) నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వ సంస్థలను బద్నాం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande